దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన

  • రెండు దశాబ్దాల పాటు కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్
  • ఇక మెగాఫోన్ పట్టనున్న ఎనర్జిటిక్ స్టార్
  • 23వ చిత్రంతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వైనం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారనున్నారు. 'దేవదాసు' చిత్రంతో హీరోగా రామ్ ప్రయాణం మొదలైంది. తనదైన నటన, చలాకీతనంతో, అదిరిపోయే డ్యాన్సులతో అభిమానులను సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాల పాటు కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోనున్నారు. రామ్ హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రంలో అభిమానులకు అదిరిపోయే వార్త సిద్ధమైంది.

హీరోగా తన 23వ చిత్రానికి రామ్ స్వయంగా దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు శుక్రవారం ఉదయం 10:08 గంటలకు అట్టహాసంగా వెలువడనుంది. తాను దర్శకుడిగా మారనున్నట్లు రామ్ రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో, ఆయనే దర్శకత్వం చేయాలనుకుంటున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సామ్ పీఎస్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయ్యాక, తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అభిమానులు రేపు రామ్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Ram Pothineni
Ram Pothineni director
Hero Ram direction
Ram Pothineni 23rd film
Telugu cinema news

More Telugu News